పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం
posted on Jan 21, 2025 9:04AM

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పరవాడ ఫార్మా సిటీలో తరచూ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదాలు జరుగుతుండటంపై మాత్రం కార్మికులలో తీవ్ర భయందోళనలను కలిగిస్తోంది.
మంగళవారం (జనవరి 21) ఉదయం ఫార్మా సిటీలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుని మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఎటువంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు.