హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు రాజ్ తరుణ్
posted on Aug 2, 2024 11:10AM
సినీ నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పదేళ్ల క్రితం తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదయింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుని పదేళ్లు కాపురం చేసిన తర్వాత మరో నటి మాల్వి మల్ హోత్రాతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను రాజ్ తరుణ్ కొట్టి పారేస్తున్నారు. తాను లావణ్యతో సహజీవనం చేసినట్టు ఆయన ఒప్పుకున్నారు. చట్టబద్దంగా వివాహం జరిగినట్టు ఎలాంటి ప్రూవ్ లేకపోవడంతో లావణ్య డిఫెన్స్ లో పడిపోయింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామి శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ లావణ్య విషయంలో స్పందించారు. తాను లావణ్యకు వ్యతిరేకం కాదని కోర్టులో పోరాడతానన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆర్జే శేఖర్ భాషా కూడా ఉన్నారు. రాజ్ తరుణ్ తరపున ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే.