ఫాస్టాగ్ వార్షిక పాస్ కు అనూహ్య స్పందన
posted on Aug 18, 2025 4:25PM

జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అద్భుత స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్ ప్లాజాల్లో ఆగస్టు15 నుంచిఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలా వచ్చిన గంటలవ్యవధిలోనే అంటే అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు 1.4 లక్షల వాహనదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఏకకాలంలో పాతిక వేల మంది లాగిన్ అవుతున్నట్లు భారత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
మూడువేల రూపాయలతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకున్న వాహనయజమానులు ఈ పాస్ తో ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులు (వీటిలో ఏది ముందు అయితే అది) వరకూ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు అయితే ఈ వార్షిక పాస్ వ్యక్తిగత వాహనాలు, వ్యాన్లు, జీపులకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వహానాలకుకాదు ఈ పాస్ ద్వారా 200 ట్రిప్పులు లేదా ఏడాది పాటు ప్రయాణించవచ్చు. అది ముగిస్తే మళ్లీ మూడువేల రూపాయలతో పాస్ ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది,