తెలంగాణలో ఆరుగురు రైతుల ఆత్మహత్య

 

కరెంటు కోతలు, పంట నష్టం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయపేట మండలం కోమటిపల్లి తండాకు చెందిన బాదావత్ మోతీలాల్ (40) తనకున్న రెండు ఎకరాల్లో పంట ఎండిపోవడం వల్ల మనోవేదనకు గురై తనపొలంలోనే పురుగుమందు తాగి మరణించాడు. సిద్దిపేట మండలం బూర్గుపల్లికి చెందిన బోదాసు మల్లయ్య (42) తన మూడెకరాల పొలంలోని మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ఎండిపోవడంతో తన అప్పు తీరే దారిలేదని పొలం దగ్గరే పురుగుమందు తాగి మరణించాడు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి చెందిన జింక భూమన్న (55) అనే రైతు పంట సాగు కోసం ఖర్చు చేసిన మూడు లక్షల రూపాయలు కరెంటు కోతల పాలు అయిపోవడంతో ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని మరణించాడు. ఆదిలాబాద్ జిల్లా కుభీరు మండలం చాత గ్రామానికి చెందిన చెందిన ఏశల లక్షణ్ (55) అనే రైతు తనకున్న మూడు ఎకరాలతోపాటు కౌలుకు తీసుకున్న రెండు ఎకరాలలో పత్తి, సోయా వేశాడు. నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. దాంతో పురుగుల మందు తాగి మరణించాడు. జిన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బండారి లక్షణ్ (55) అనే రైతు కూడా పంట ఎండిపోవడంతో పురుగుమందు తాగి మరణించాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌లో మాలిగ దశరథ (45) అనే రైతు తన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu