తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

 

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. మంగళవారం నాడు ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం నాడు మరో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆరు ఎకరాల్లో వేసిన పంటలు విద్యుత్ కోతల కారణంగా ఎండిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu