కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న దొంగ బాబా అరెస్ట్

కరోనా వ్యాక్సిన్ తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కృషి చేస్తుంటే.. మరోవైపు తాయత్తు తో కరోనాని ఖతం చేస్తామంటూ కొందరు దొంగ బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌ లోని మియాపూర్‌ లో కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఓ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్మాయిల్‌ బాబా అనే వ్యక్తి సమస్యలు తీర్చుతానంటూ తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునేవాడు. అయితే, ప్రజల్లో కరోనా భయం ఎక్కువైపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు. కరోనా రాకుండా చేస్తానని, కరోనాకు మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే, అతడు డబ్బులు తీసుకున్నప్పటికీ కరోనాకు మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇస్మాయిల్‌ బాబాను అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu