అంగన్ వాడి కేంద్రం లో బ్లాక్ దందా..

మనుషులకు  రోజు రోజుకి డబ్బు దాహం పెరిగిపోతుంది. డబ్బు ఉంటే అన్ని ఉంటాయి అనే భామతో బతుకుతున్నారు..ఆ డబ్బుకోసం కల్తీ బాటపడుతున్నారు చాలా మంది. లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులు అమ్మడం.. ఇలాంటివి గోదముల్లోనూ, కిరాణ దుకాణాల్లోనూ పాల సెంటర్ లోను జరుగుతుంటాయి.  కొంత మంది  అంగన్ వాడి నిర్వాహకులు  పసిపిల్లల నోటి కాదు బువ్వను గుంజుకుంటున్నారు. తాజాగా ఈ తరహా బురిడీ అంగన్ వాడి కేంద్రం లో జరిగింది. అది ఎక్కడో తెలుసుకుందామా..? 

అది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లను కాల పరిమితి ముగిసిన తర్వాత అందజేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని కేసముద్రం మండలం కల్వల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 8 మంది పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ సిబ్బంది ఈ ప్యాకెట్స్ అందజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని రేణుక, రాధ అనే పిల్లల తల్లులు తెలిపారు. దీనిపై స్పందించిన అంగన్ వాడీ సూపర్వైజర్ విజయ మాట్లాడుతూ.. బాలామృతం ప్యాకెట్స్ కాలపరిమితి ముగిసింది వాస్తవమే అని, ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మొత్తానికి అంగన్ వాడి కేంద్రాల్లో కూడా చివరికి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. పసిపిల్లలు దేవుడి తో సమానం అంటూనే వాళ్ళ గుంతు నొక్కే పని చేస్తున్నారు.. 

రెండు నెలల బాలుడి హత్య.. 

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల బాలుడిని హత్య చేసిన ఘటన జిల్లాలోని అనాజ్ పూర్‌లో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బాలుడిని హత్య చేసి నీటి ట్యాంకులో పడేశారు.  తమ కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బాలుడి కోసం వెతికారు. అయినా చిన్నారి జాడ తెలియకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్‌లో బాలుడి ఆచూకీ కోసం వెతికారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో ఇంటిపై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. దుండగులు బాలుడిని హత్య చేసి నీటి ట్యాంకులో పడేసినట్టు గర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.