బాలీవుడ్ సెలబ్రిటీలకు పాక్ నుంచి బెదరింపు మెయిల్స్.. బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా?

ఖతం చేస్తామంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదరింపు మెయిల్స్ వచ్చాయి. అలా బెదరింపు మెయిల్స్ వచ్చిన వారిలో ప్రముఖ కమేడియన్ కపిల్ శర్మ, నటుడు రాజ్ పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటుడు, గాయకుడు సుగంధమిశ్రా ఉన్నారు.

దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రెస్ ల ఆధారంగా  ఆ బెదరింపు మెయిల్స్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.  తమ బెదరింపులపై ఎనిమిది గంటలలోగా స్పందించకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందన్నది ఆ ఈ మోయిల్స్ సారాంశం. పోలీసులు బెదరింపు ఈమెయిల్స్ వచ్చిన సెలబ్రిటీలకు భద్రత కల్పించారు. ఈ బెదరింపు మెయిల్స్ గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu