ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా 

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లును విచారించిన న్యాయస్థానం ఏలూరులో ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో 12 మున్సిపల్ కర్పొరేషన్లకు మార్చి 10 ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ముఖ్య పట్టణం.1886లో ఏలూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. జనాభ ప్రతాపాధికన 2005లో ఏలూరును మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తించారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే ఎలూరులో పాగా వేయాలని వైసీపీ ముందు నుంచే పథకాలు రచించింది. అందులోభాగంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందుగానే రూ.50 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను హైకోర్టు నిలిపివేయంతో అధికార పార్టీకి మింగుడుపడడం లేదు.