అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలలో ఈడీ సోదాలు
posted on Jul 24, 2025 12:30PM

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం (జులై 24) సోదాలు చేపట్టారు. ఢిల్లీ, ముంబయిలోని ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాదాపు 50 ప్రదేశాలలో ఏకకాలంలో ఈ దాడులు చేస్తున్నారు. ఎస్‌బీఐ ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాథాన్యత సంతరించుకుంది.
అనిల్ అంబానీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీల్యాండరింగ్ పై దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై దృష్టి సారించింది అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాలు ఎందుకు, ఏ అవకతవకలకు సంబంధించి జరుగుతున్నాయనే విషయంపై ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఈడీ వెలవరించలేదు.