ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. సులవెసి ద్వీపంలో బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం ఆరున్నర గంటల తరువాత భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ భూకంపం కారణంగా సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu