వీవీఐపీ, వీఐపీ దర్శనాలకూ టికెట్లు!

విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుడి ఆదాయానికి గండి కొడుతున్న వీఐపీ, వీవీఐపీ దర్శనాలకూ ఇక నుంచి టికెట్ తప్పని సరి చేశారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి నిత్యం మూడు వందల మంది వరకూ వీఐపీలు, వీవీఐపీలు వస్తుండటం, వారందరికీ ఉచిత దర్శనాలతో దుర్గ గుడి ఆదాయానికి భారీగా గండిపడుతోందని భావించిన ఆలయ అధికారులు ఇక నుంచి ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు.   అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.

నిత్యం వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో  30 వేల మంది,  వారాంతాల్లో  50 వేల వరకు దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వస్తారు. వీరిలో రోజుకు మూడు వందల మంది వరకూ వీఐపీ, వీవీఐపీలు ఉంటారు. వీరంతా ఉచితంగానే ఎటువంటి టికెట్ తీసుకోకుండా  దుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. ఈ విషయంపై ఆలయ ఈవో స్పందించారు. ఇకపై  ఈ పద్ధతికి అడ్డుకట్ట వేయాలని  భావించి, ఆ మేరకు ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu