ఇంత మోసమా.. ఎందుకీ కుట్ర.. ఎవరికోసం ఈ నాటకం?

అనుకున్నట్లుగానే, అనుమానించిన విధంగానే, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ వేడిని రాజేసింది. జిల్లాల పేర్ల విషయంగా తలెత్తిన వివాదం మొదలు, సరిహద్దుల వివాదాలు, నియోజక వర్గాల సర్దుబాటు, కూడికలు తీసివేతలు, దూర భారాలు, కులం కొట్లాటలు, ఆస్తుల పంపకాలు, రాజకీ కుట్రలు, కుతంత్రాలు ఇలా ఒకటని కాదు, అన్ని రకాల రాజకీయ రచ్చకు  కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం, రంగం సిద్దం చేసింది. వేదికగ మారింది. ఎక్కడి కక్కడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, అనుకూలంగా విందులు చిందులు అన్నీ జరిగి పోతున్నాయి. 

ఈ నేపధ్యంలోనే, ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ శ్రమ అనుకోకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘దివ్యమంగళ’ ప్రణాళికను, ఆయనగారి ‘పవిత్ర’ ఆశయాన్ని చాలా చక్కగా  వివరించారు. అయితే, ఆయన వివరణను విన్నతర్వాత, ఉన్న అనుమానాలు నివృత్తికాక పోగా,  ఏ నిర్ణయం వెనక ఏ కుట్ర దాగుందో, అన్న సందేహాలు ఎక్కువయ్యాయి, నిజం, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా, విజయకుమార్ వివరణతో మహా కుట్ర మాటున దాగున్న కుట్రలు, కుతంత్రాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి అనటున్నారు విశ్లేషకులు, మరీ ముఖ్యమంగా స్థానిక లోగుట్లు తెలిసిన ప్రజలు, పాత్రికేయులు.  

అసలు ఇలాంటి సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు వంటి చిచ్చును రాజేయడమే, జగన్నాటక  సూత్రదారి మహా కుట్ర అనుకుంటే, ప్లానింగ్ సెక్రెటరీ ప్రవచన పలుకులు మరింత మంత్ర ముగ్ధులను చేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇంతవరకు బయటకు వచ్చిన దానికంటే  దాగున్నదే ఎక్కువ ఉందని, అసలు గుట్టు మొత్తం బయట పడితేనే గానీ , ఈ మొత్తం వ్యవహారం అసలు రంగు బయట పడదు అంటున్నారు. 

ఇక వారు ఏమి చెప్పారో చూడండి ..అన్నీ ఇక్కడ చెప్పలేము కాబట్టి.. ఉదాహరణకు నలుగు పలుకులు పట్టి చూద్దాం ...
1.    సంతనూతలపాడు... బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది... అయితే... బాపట్ల కి దూరం కాబట్టి ఒంగోలు తో కలిపాం...బాగుంది. చాలా బాగుంది. 
2.    పాణ్యం ... నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది... అయితే... నంద్యాల కి దూరం కాబట్టి కర్నూల్’లో కలిపాం...ఇది కూడా బాగుంది. 
3.    పుంగనూరు... రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది...అయితే... రాయచోటి దూరం కాబట్టి...(రాయచోటి ప్రస్తుత ప్రతిపాదిత జిల్లా రాజం పేటకు బదులు) చిత్తూరు లో కలిపాం...శభాష్ చక్కగా వుంది. 
4.    సర్వేపల్లి... తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది...అయితే ... తిరుపతి ( బాలాజీ) దూరం కాబట్టి నెల్లూరు జిల్లాలోనే ఉంచాం...ఇది ఇంకా .. ఇకా బాగుంది. 
కానీ, ఇన్ని జిల్లాల విషయంలో... ఇన్ని నియోజకవర్గాల విషయంలో అంత చొరవ చూపించి, దూర భారాలను అడుగులు అంగుళాలలో కొలిచి మరీ దూరం అవుతుంది అని దగ్గర చేసిన అధికారులకు "కందుకూరు" ప్రజలు ఎందుకు కనిపించలేదు...???వారికి ఒంగోలు ఎంత దూరం నెల్లూరు ఎంత దూరం...???వారి విషయంలో ఎందుకు ఇంత వివక్ష...???వారికి అవసరం లేదా సత్వర న్యాయం... పరిపాలనా సౌలభ్యం...???దీని వెనుక కుట్ర ఏంటి...??? నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు...??? ఇందుకు చారిత్రకంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి అలానే ఉంచాం... ఇది ప్లానింగ్ సెక్రెటరీ విజయకుమార్ గారి ముక్తాయింపు... కానీ, కందుకూరుకు నెల్లూరు దగ్గగా ఒంగోలు దగ్గరా.. 40 కిమీ దూరంలో ఉన్న ఒంగోలు దగ్గర, 120 కిమీ దూరంలో ఉన నెల్లూరు దగ్గరో.. అధికారులెచెప్పాలని కందుకూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
అదలా ఉంటే, ఈ ‘కుట్ర’, (అవును  కందుకూరు జనం ఇది కుట్రనే అంటున్నారు). అసంబద్ధ నిర్ణయానికి చీమకుర్తి గ్రానైట్ గనులు, ఒక కారణంగా అనుమనిస్తున్నారు, అలాగే, ఓడరేవులను ఇటూ చేసే కుట్ర ఉందా అన్నన్ అనుమానాలు కూడ వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోఇప్పటికే కృష్ణ పట్నం ఓడరేవు వుంది... ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం ఓడరేవుకు  ఇప్పటికే  శంఖు స్థాపన జరిగింది. ఇపుడు ఒకే జిల్లాలో రెండు ఓడ రేవులా??  అనే నెపంతో ఎంకేక్క్డికో ఎత్తుకుపోయే కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఇది ఒక్క కందుకూరు సమస్య మాత్రమే కాదు.. చాలా వరకు జిల్లాల్లో చిన్నా పెద్దసమస్యలు చాలనే ఉన్నాయి అంటున్నారు.