జగన్, కేసీఆర్.. ఇద్దరూ ఇద్దరే.. షర్మిల ఫైర్

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే బాటన నడుస్తున్నారా? సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు, అడ్డదారులు తొక్కు తున్నారా? అంటే అవుననే అంటున్నారు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రైతులు ఆత్మహత్యలు, రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత నుంచి మీడియా దృష్టిని పక్కదారి పట్టించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘డ్రగ్స్’ సమస్యను తెరపైకి తెచ్చారని, ఆలాగే ఉద్యోగుల ఆందోళన, ఆర్థిక పరిస్థితి నుంచి ప్రజల దృషిని పక్క దారి పట్టించేందుకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని, తెరపైకి తెచ్చారని షర్మిల అన్నారు. ఆంధ్ర ప్రదేశ్’లోనూ షర్మిల పార్టీ పెట్టే అలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపద్యంలో షర్మిల పరోక్షంగానే అయినా ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే గాటన కట్టేయడం ఆసక్తి కరంగా మారింది. ఏపీ రాజకీయల గురించి మాట్లాడను అంటూనే షర్మిల అన్నకు కూడా అక్షింతలు వేశారు. 

కాగా, తెర వెంక కారణలు ఏవైనా, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఫై ఫైరయ్యారు. కేసీఆర్’ను బోనులో నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుకు మీ ప్రభుత్వం ఇస్తున్న నిర్వచనం  ఏమిటని నిలదీశారు.రైతుల మధ్య వివక్ష చూపుతున్నారని మండి పడ్డారు. 59  సంవత్సరాలు నిండిన రైతులు చనిపోతే, రైతు బీమా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఏ వయసు వారైనా చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రైతు బంధు వర్తిపచేయాలని, ముఖ్యమంత్రిని షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు అమె ముఖ్యమంత్రికి లేఖ రాశారు.ప్రభుత్వం తక్షణం స్పందించక పోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విధానాలను షర్మిల,ఎండగట్టారు. గడచిన మూడు సంవత్సరాలలో, కేసీఆర్ ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారమే ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అంటూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సిగ్గుపడాలని, అన్నారు. రాష్ట్రంలో నిన్న( బుధవారం) ఒక్క రోజే ఐదుగురు రైతులు ఆత్మహత్య  చేసుకున్న నేపధ్యంలో. మీడియా ముందుకు వచ్చిన షర్మిలా ముఖ్యమంత్రి కేసీఆర్’ఫై ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కీసీఆర్’కు వ్యవసాయ విధానమే లేదని, ఎప్పుడు ఏది తోస్తేమ అది చెపుతారని అన్నారు. వారి వద్దు ప్రత్యాన్మాయ పంటలు వేయమన్నారు . నినా చనిపోయిన్ ఐదుగురు రైతులు ప్రత్యాన్మాయ పంటలే వేసాశారని,   ఇద్దరు పత్తి రైతులు అయితే, ఇద్దరు మిర్చి రైతులు, ఒకరు ధరని బాధితులని చెప్పారు. ఈ రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. 

రైతు బంధు పధకం 18 - 59మధ్య వయసున్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని, అంటే రైతులు 59 సంవత్సరాలలోపే చనిపోవాలని ముఖ్యమంత్రి శాసిస్తున్నారా? రైతుల ఆత్మ హత్యలను ప్రోత్సహిస్తున్నారా, అని షర్మిల ప్రశ్నించారు. అలాగే  కౌలు రైతులకు రాష్ట్రంలో గుర్తింపే లేదని, ఇదెక్కడి అన్యాయమని , ఇదెక్కడి లాజిక్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 66 లక్షల రైతు కుటుంబాలుంటే అందులే సగం మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బీమా వర్తింప చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు లేని వయోపరిమితి రీతులకు ఎందకని, అన్నారు, 67 వయసులో ముఖ్యమత్రి సర్వ సంరక్షణలు పొందవచ్చును, పదవీ విరమన చేసిన ఉద్యోగులకు బతికున్నంత కాలం పెన్షన్ వస్తుంది.. కానీ, రైతులు మాత్రం 60 ఏళ్ళు వస్తే,రైతు కాకుండా పోతారు, ఇదెక్కడి లాజిక్’ అని షర్మిలా ప్రశ్నించారు.   

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలను ప్రస్తావిస్తూ, ఇంట గెలిచి రచ్చ గెలవాలని చురక అంటించారు. రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారని, ఇతర రాష్ట్రలకు పోతారని ఎగతాళి చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నిలుపుకోలేదని అన్నారు. ధరణి పోర్టల్’ తప్పుడు సమాచారం కారణంగానూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటూ కేసీఆర్ ప్రణాళికలు,పెళ్ళికి పందిరేస్తే కుక్క తోక తగిలి కూలినట్లు ఉన్నాయని ఎద్దేవ చేశారు. 
అయితే,షర్మిల ఒక్కసారిగా ఎందుకు ఇలా కేసీఆర్ మీద విరుచుకు పడ్డారు? అంటే, కొద్ది రోజులుగా వైఎస్సార్ టీపీ, కథ ముగిసిందని వార్తలు రావడమే ఇందుకు కారణం అంటున్నారు. అదే సమయంలో, రాష్ట్రంలో తమ ఉనికి చెప్పుకునేందుకే షర్మిల ఇలా  ముఖ్యమంత్రి టార్గెట్’గా చెలరేగి పోయారా లేక ఇంకేదైనా కారణం ఉందా? అనేకోణంలోనూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.