అలాంటి వీడియోలతో ఆత్మహత్యలు పెరుగుతాయి

హైద్రాబాద్ లో సెల్ఫీ సుసుడ్ కలకలం రేపింది. జగిత్యాల జిల్లాకు చెందిన హీరో షోరూం యజమాని నరేష్ హైదరాబాద్ లో  ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు నరేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు వివరించారు. వ్యాపారంలో నష్టం రావడానికి తనే కారణమని ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో అప్పటికే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఈ వీడియోలు ప్రేరణ ఇస్తాయని సైకియాట్రిస్ట్ లు అంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలో మెడికో ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు వైరల్  అవడం వల్ల  మనస్థాపంతో మెడికో ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు వచ్చి ఆ మెడికోను గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో మెడికో తీవ్ర మనస్థాపానికి గురైంది. పరువు పోయింది నేను బతకడం అనవసరం అనుకుంది ఆ మెడికో. వెంటనే ఆత్మహత్య చేసుకుంది.  అదే రోజు నుంచి తెలంగాణలో కొందరు అమ్మాయిలు  ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా చేసుకోవడం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులకు శిక్షలు ఉంటాయి. 
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాగానే ఇతర సబ్జెక్టు మీద మనసును డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలను నిరోధించవచ్చని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు. యూట్యూబ్ లలో ఇలాంటి వీడియోలు వెంటనే డిలీట్ అయ్యే టెక్నాలజీ ప్రవేశ పెడితే కొంతవరకు ఆత్మహత్యలను నిరోధించవచ్చని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.