సద్దాం హుస్సేన్ చాల మంచి వాడు.. ట్రంప్
posted on Mar 16, 2016 5:12PM

డోనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓహియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ట్రంప్ మాట్లాడుతూ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సద్దాం హుస్సేన్ టెర్రరిస్టులను చంపడంలో చాల మంచి వాడని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఒబామా మీద విరుచుకుపడ్డారు. ఇరాన్, ఇరాక్ దేశాలను హస్తగతం చేసుకోవాలన్న కారణంతోనే ఆ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడ్ ఆయిల్ పై చలామణి చెయ్యాలని ప్రయత్నించారని విమర్శించారు. అందుకే ఇరాక్ మీదకు అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు.
ఈ కారణంగానే ఐసిస్ ఆవిర్భవించిందని అన్నారు. అయితే అంతలోనే ట్రంప్ మాట మార్చి.. సద్దాం హుస్సేన్ చాల మంచి వాడని ఎవరు చెప్పారు.. ఉగ్రవాదులను చంపడంలోనే సద్దాం హుస్సేన్ మంచివాడని తాను చెప్పాను అంతే అని చెప్పుకొచ్చారు.