సుప్రీంకోర్టు రాజకీయంగా పనిచేస్తుంది..
posted on Jun 6, 2017 5:47PM
.jpg)
ఇప్పటికే వీసా నిబంధనలు కఠినతరం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికా రావడంపై ఆయన ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే అమెరికా కోర్టులు ఆ నిబంధనలను నిలుపుదల చేశాయి. ఇప్పుడు ఆ నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు ట్రంప్ సర్కారు ఆ దేశ సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది. ‘‘ప్రయాణ నిషేధంపై తొలుత ఇచ్చిన ఆదేశాలకే న్యాయ విభాగం కట్టుబడి ఉండాలి. నీరుగార్చిన, రాజకీయపరంగా మార్పులు చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టుకు సమర్పించారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. దేశ భద్రత దృష్ట్యా అమెరికా వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కోర్టులు నెమ్మదిగా, రాజకీయంగా పనిచేస్తున్నాయ’ని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.