పేలడానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్‌గా ఇండియా..ట్రంప్
posted on May 3, 2016 12:43PM
.jpg)
నిన్ననే చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ ఇండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇండియా తమ ఉద్యోగాలు తన్నుకుపోతుందంటూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మరోసారి ఇండియాపై విరుచుకుపడ్డారు. తమ దేశీయుల ఉద్యోగాలను తన్నుకుపోతూ ఇండియా తమకు అన్యాయం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇండియాతో పాటు చైనా, వియత్నాం, జపాన్ ఎన్నో విషయాల్లో అమెరికాకు నష్టం కలగజేస్తున్నాయంటూ ఆరోపించారు. ఓ వైపు ఇండియాపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు కాసేపట్లో పేలడానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్‌గా ఇండియాను అభివర్ణించారు. వేరే దేశాలనుంచి యువత తమ దేశానికి వచ్చి ఇక్కడి ఉద్యోగాలను కొట్టేయడమేంటంటూ ఆయన ప్రశ్నించారు.