వైకాపాలో చేరట్లేదు: డొక్కా

 

మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవదానికి సిద్దపడిన తరువాత అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన రాజకీయ గురువుగారైన నరసరావు పేట యంపీ రాయపాటి సాంభశివరావు ఆయనని వైకాపాలోకి వెళ్ళవద్దని సూచించడంతో ఆయన తన ఆలోచనను విరమించుకొంటున్నట్లు ప్రకటించారు.చాలా సౌమ్యుడిగా పేరున్న ఆయన అంబటి రాంబాబుకి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి మాట ఇచ్చి తప్పు తున్నందుకు పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో తను సరయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నానని కనుక మరి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండదలచానని తెలిపారు.

 

 ప్రజలలో మంచి పేరున్న వాడు, రాజకీయ అనుభవజ్ఞుడు, దళితుడు అయిన ఆయనని తెదేపాలోకి తీసుకొంటే బాగుంటుందని రాయపాటి తెదేపా అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తెదేపా అధిష్టానం, జిల్లా నేతలు కూడా చాలా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కనుక నేడు కాకపోయినా ఏదో ఒకనాడు ఆయన తెదేపాలో చేరవచ్చని అందరూ భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu