మీకు తెలుసా? ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ ను స్లో గా పెంచేస్తాయ్..!

 

యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే ఒక వ్యర్థ పదార్థం.  శరీరంలో ప్యూరిన్స్ అనే రసాయనాలు ప్రాసెస్ అయినప్పుడు లేదా అవి విచ్చిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.  సాధారణంగా శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ రక్తంలో కరికి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది శరీరంలో పేరుకుపోతుంది.  ఇలా పేరుకుపోవడం వల్ల శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ సమస్య కూడా వస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాపకింద నీరులా శరీరంలో పెరిగిపోతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

గొడ్డు మాంసం..

గొడ్డు మాంసం చాలా మంది తింటుంటారు.  అలాగే గొర్రె మాంసం అధికంగా తింటారు. ఇక పంది మాంసం విదేశాలలో ఎక్కువగా తింటారు.  ఈ మాంసాలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిల ఉత్పత్తి దారుణంగా పెరుగుతుంది.  యూరిక్ యాసిడ్ సమస్య ఇప్పటికే ఉన్నవారు పైన చెప్పుకున్న మాంసాలకు దూరంగా ఉండటం మంచిది.

సముద్ర ఆహారాలు..

సముద్ర ఆహారాలలో ప్రోటీన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయని చెబుతారు. అయితే సముద్ర చేపలు, జీవులు అయిన మాకేరెల్,  ఆంకోవీస్ వంటి సముద్ర చేపలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.

షుగర్ డ్రింక్స్..

అధికంగా ప్రక్టోజ్ కలిగిన కార్న్ సిరప్ తో తయారు చేసే శీతల పానీయాలు, ఇతర పానీయాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.  ఈ చక్కెర పానీయాలు కేవలం యూరిక్ యాసిడ్ స్థాయినే కాకుండా మధుమేహం పెరగడానికి,  ఊబకాయానికి కూడా కారణం అవుతాయి.

ఆల్కహాల్..

ఆల్కహాల్ తాగే అలవాటు రోజురోజుకూ ఎక్కువ అవుతూందని చెప్పవచ్చు.  ఆల్కహాల్ తాగడం అనేది ఫ్యాషన్ లో భాగం అయిపోయింది. బీర్ తో సహా ఇతర ఆల్కహాల్ పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను చాలా పెంచుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు చాలా ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ స్థాయి వల్ల జరిగే ప్రమాదం ఎక్కువ  ఉంటుంది.

ప్రాసెస్ ఫుడ్స్..

ప్రాసెస్ చేసిన ఆహారాలలో శుద్ది చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.  అలాగే శుధ్ది చేసిన చక్కెరల వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో పనిచేస్తాయి.

పుట్టగొడుగులు..

పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలామంచివి.  వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్, విటమిన్-డి లభిస్తాయి. అయితే పుట్టగొడుగులలో మితంగా ప్యూరిన్ లు ఉంటాయి. పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగుతాయి.

కాలీఫ్లవర్..

కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన సీజనల్ కూరగాయ.  ఇందులో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కాలీఫ్లవర్ ను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు మరింత పెరుగుతాయి.  అంతేకాదు.. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి.


                                        *రూపశ్రీ.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu