జగన్ వ్యాఖ్యలతో పోలీసు అధికారుల్లో నైరాశ్యం
posted on Feb 19, 2025 5:11PM
విజయవాడ్ సబ్ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని పరామర్శించడానికి వచ్చిన వైకాపా అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్ల పాలనలో జగన్ అధికార దుర్వినియోగం చేసిన తీరు ప్రతీ పోలీసు అధికారికి తెలుసు. వైసీపీ ఎంపిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణ రాజును పోలీస్ టార్చర్ పెట్టిన ఘటన బహుషా ఎవరూ మర్చిపోరు. తాము అధికారంలో రాగానే అన్యాయం చేసిన పోలీసు అధికారుల బట్టలూడదీస్తామని జగన్ వ్యాఖ్యలు చేశారు. పోలీసుటోపిపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయాలని వైకాపా నేత హెచ్చరించారు. చట్టాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీని అరెస్ట్ చేశారు. పరామర్శకు వచ్చిన జగన్ పరామర్శించి వెళ్లిపోయి ఉంటే ఇంత రచ్చ జరిగేదికాదు. పోలీసులను పరుష పదజాలంతో దూషించినప్పటికీ జగన్ పై కేసు నమోదు కాకపోవడం పోలీసుల ఆత్మస్తైర్యం దెబ్బతీసింది. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తప్పు పట్టింది. అధికారం కోల్పోయిన జగన్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం తప్పుడు సంకేతాలు వెళ్తాయని సర్వత్రా వ్యక్తమైంది. ఎన్నికల కోడ్ ఉండగానే గుంటూరు మిర్చియార్డు కు జగన్ వచ్చినప్పుడు కూడా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్టు వ్యవహరించారు. ఈ అలుసే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. జగన్ పర్యటకు జిల్లా పోలీసులు నిరాకరించారు. అయినా జగన్ మిర్చియార్డకు వచ్చి నానా హంగామా చేశాడు. ఎన్నికల అధికారి ప్రేక్షకపాత్ర వహించడం టిడిపి శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వైకాపా హాయంలో అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకునే సాహసం పోలీసు అధికారులు తీసుకోవాలంటే కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మెతకవైఖరి వీడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చం ద్రబాబు మెతక వైఖరి ఉన్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వైఖరి అవలంబిస్తే తప్పుడు సంకేతాలు అధికారులకు వెళ్లే ప్రమాదం ఉంది.