జ‌గ‌న్ ప‌ట్ల ఆగ్ర‌హంతో చెప్పుతో కొట్టుకున్న విక‌లాంగులు

అనాలోచిత నిర్ణ‌యాలు ప్ర‌మాద‌క‌ర‌మే. అందునా ప్రభుత్వం తీసుకుంటే దాని ఫ‌లితాలు పొందేవారి జీవితం మ‌రింత దుర్భ‌రం కావ‌డం బాధాక‌రం. మొన్న‌టివ‌ర‌కూ ఇస్తున్న పింఛ‌న్లు ఇపుడు కాదంటే వాటి మీద‌నే ఆధార‌ప‌డేవారు మ‌రి జీవితం చాలించాలా? ఈ ప్ర‌శ్న‌ను ప్ర‌భుత్వాన్ని వేయ‌లేక‌, త‌మ‌కు ఆసారా పోయింద‌న్న బాధ‌తో విక‌లాంగులు నానా అవ‌స్థా ప‌డుతున్నారు. విక‌లాంగుల‌కు వై ఎస్ రాజ‌ శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో పెన్ష‌న్ మంజూర‌యింది. వారు మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న పేరు చెప్పుకుని బాగానే గ‌డిపారు. కానీ ఇటీవ‌లే రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విక‌లాంగుల పెన్ష‌న్ చాలామందికి తొల‌ గించారు. 

పెన్ష‌న్ తొల‌గించ‌డానికి ప్ర‌భుత్వం చెప్పే జ‌వాబు కంటే పెన్ష‌న్ ఇక రాద‌న్న బాధే విక‌లాంగుల‌ను ఇబ్బం ది పెడుతోంది. తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి ప‌రిధిలోని వెలంపాలెంకు చెందిన  దివ్యాంగుడు వెంకటే శ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు త‌మ బాధ‌ను వెళ్ల‌బుచ్చుకున్నారు. వెంక‌టేశ్వ‌ర్లుకి రెండు కాళ్లూ ప‌నిచేయ‌వు, చేతులు రెండూ వంక‌ర్లు తిరిగాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న వీల్‌ఛైర్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయినా త‌న సోద‌రుని స‌హాయంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తూన్నారు. కానీ ప్ర‌భుత్వాధికారులు ప‌ట్టించుకోలేదు. తండ్రిలానే త‌మ‌ను ఆదుకుంటాడ‌ని జ‌గ‌న్ రెడ్డి ప‌ట్ల వీరాభి మానంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎంతో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌వారిలో ఈ సోద‌ రులూ ఉన్నారు. కానీ రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోయాయి.  

 ప్రస్తుత జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కు తోచని స్థితి ఏర్పడింది. తనలాంటి వందలాది మందికి పెన్షన్ తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు  ఓటేసి నందుకు తమ చెప్పుతే తామే కొట్టుకున్నారు, ఆ సోద‌రులు.  వీలైతే న్యాయం చేయాలని లేకపోతే ముఖ్య మంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.