పాల‌నాసౌల‌భ్యం కోస‌మే రెవెన్యూ ఉద్యోగుల్ని తీసుకునేది.. మంత్రి కొట్టు

దేవాదాయ‌శాఖ‌లో ఉద్యోగుల కొర‌త‌వ‌ల్ల‌నే పాల‌నా సౌల‌భ్యం కోసమే రెవెన్యూ ఉద్యోగుల‌ను దేవా దాయ‌ శాఖలో తీసుకుంటున్నామ‌ని  దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ  స్పష్టం చేశారు. 

మాన్యం భూములపై పూర్తి హక్కు దేవదాయ శాఖకే ఉంటుంద‌న్నారు. అయితే వాటి  మీద వచ్చే  ఫల సాయంపై మాత్రమే అర్చకులకు హక్కు ఉంటుందని  మంత్రి  తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదే శాలతో ధార్మిక  పరిషత్ ఏర్పాటైందని, అయితే టీడీపీ హయంలో పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయలేదో ఆ  పార్టీ నాయకులే చెప్పాలన్నారు.

అవినీతిని అరికట్టడం, ఇతరత్రా నిర్ణయాలు తీసుకోవడంలో ధార్మిక  పరిషత్  కీలక  పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఏర్పాటైన ధార్మిక  పరిషత్‌లో 21 మంది సభ్యులు ఉంటారు. భూములు, దుకాణాల లీజ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం ధార్మిక పరిషత్ ఉంటుంది. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామంలో ఒక  దేవాలయానికి ధూప  దీప  నైవేద్యా లు  కోసం  నిధి  ఏర్పాటు చేస్తున్నాం. 

దేవాదాయ శాఖ పరిధిలో 4 లక్షల  ఎకరాలకు పైగా  భూములు ఉన్నాయని,  కోర్టు వివాదాల్లో ఉన్న ఆల య భూములు, కేసుల పురోగతి తెలుసుకోడానికి త్వరలో తయారు చేయించే వెబ్‌సైట్లో పొందుపరుస్తా మని చెప్పారు.