హార్ట్ ఎటాక్ నిర్ధారణ ?


వ్యాధి నిర్ధారణ...

పేషంట్ ఆరోగ్య చరిత్రను బట్టి,కొన్ని ప్రత్యేక టెస్టులు ద్వారావ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. తక్షణంగా ఇ సి జి పరీక్ష చేస్తారు. అప్పటికే డ్యామేజి అయిన గుండె కండరం రక్తం లోకి రిలీజ్ చేసే కొన్ని రకాల ఎంజైమ్ పరీక్షలు జరుపుతారు.ఒక వేళ సర్జరీ చేయాలన్న ఆలోచనకు వస్తే ఎమర్జెన్సీ కోరోనరీ ధమని యంజియో గ్రఫీ ని నిర్వహిస్తారు.

డాక్టర్ ఏమి చేస్తారు?...

తగిన మందులతో మొదట నొప్పిని తగ్గించడానికి ప్రయాత్నిస్తారు.మందులతో ఇంటి వద్దే వైద్యాన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయాన్ని తగిన నిర్ణయం తీసుకోవాలి.నిర్ధారణకు ఇ సి జి బ్లడ్ టెస్ట్ లు మొదలైన వాటిని చేయిస్తారు.

హార్ట్ అట్టాక్ ఎంతవరకూ ప్రమాదం?....

హార్ట్ అట్టాక్ వచ్చిన కొన్ని గంటల దాకా తట్టుకోగలిగి వారిలో 8౦%మంది కోలుకోడానికి అవకాశం ఉంది.హార్ట్ అట్టాక్ సీరియస్ గా వచ్చినా కూడా పేషంట్ 4౦ ఏళ్ల లోపు వాళ్ళయితే పెద్ద ప్రమాదమేమి జరగదు.చాలా మంది తిరిగి తమ పనుల్లో పాల్గొన గలుగుతారు.కొద్ది మందికి మాత్రం శరీరానికి శ్రమ నిచ్చే పనుల్లో పాల్గొంటే యాంజైనా తలెత్తే అవకాశం ఉంది.

కొందరు పేషంట్లు మాత్రం శారీరక శరం అంటూ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది తిరిగి  మళ్ళీ గుండె పోటు రాకుండా ఉండడానికి డాక్టర్స్ సూచించిన విధంగా తగు ఆహారం విషయంలో జాగ్రతలు తీసుకోవడం శరీరం బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొగతాగడం మానివేయాలి.మీ శరీర అవసరాన్ని బట్టి నిపుణులైన వ్యాయామ పద్దతులు అనుసరిస్తూ దీర్ఘకాలిక జాగ్రత్తలు పాటించాలి.

గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి?

గుండె పోటు ఎవరికైనా రావచ్చు. ఏ సమయం లోఅ యినా రావాచ్చు. ప్రతి యేటా వేలాది మంది గుండె పోటు మూలంగా చనిపోతున్నారు. వీళ్ళంతా అధి కబరువు ఉన్న వాళ్ళు కాదు. వొత్తిళ్ళ కు గురి అవుతున్న వాళ్ళూ కాదు.అంటే చాలా సాదా  సీదాగా కనిపించే వాళ్ళు కూడా గుండె పోటు తో చనిచానిపోతున్నా రన్న విషయం మీరు తెలుసుకోవాలి.గుండె పోటు అందించే వార్నింగ్ సిగ్నల్స్ ని పసిగట్టడం ద్వారా దాని నుండి బతికి బయట అవకాశాన్ని మెరుగు పరుచుకోవచ్చు.

గుండె పోటు వచ్చే అవకాసం ఉందన్న వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందా?...

ఛాతీ మధ్య భాగాన,చాతి ఎముకకు వెనుక వైపున బిగాదీసినట్లుగా బరువుగా నొప్పి ఉంటుంది.ఆ నొప్పి భుజాల వైపు కు అక్కడినుండి అక్కడి నుండి చేతులకూ వ్య్యపిస్తుంది.తూలు తున్నట్లుగా అనిపించడం.చెమటలు పోసి ఊపిరి అందక పోవడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు.

ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.గట్టిగా దగ్గండి.మీ గుండె అప్క్రమామ్గా కొట్టుకుంటే గట్టిగా దగ్గడం వల్ల హార్ట్ బీట్ మళ్ళీ మామూలు క్రమానికి రావచ్చు.

యామ్బులేన్సును పిలవండి...

కారులో రావడం కంటే యాంబు లెన్స్ లో వచ్చినప్పుడు మిమ్మల్ని వెంటనే ఎడ్మిట్ చేసుకుంటారు.

యాస్పిరిన్ తీసుకోండి...

వెంటనే ఒక యాస్ప్రిన్ టాబ్లెట్ ను చప్పరించండి. (మింగవద్దు) దీనివల్ల క్లాట్ ఫార్మ్ కాకుండా నివారించ వచ్చు.

డాక్టర్ ను పిలవండి...

మీ ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చెయ్యండి. మీ మెడికల్ ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఎమెర్జెన్సీ డాక్టర్లకు వాటి గురించి అయన వివరిస్తారు.

నిబ్బరంగా ఉండండి...

ఒకవేళ ఎమర్జెన్సీ రూముకు తీసుకు వెళ్తుంటే బెదిరి. పోకండి గుండె ధైర్యంగా  ఉండండి  మీరు పెద్ద విపత్తులో ఏమి లేరు. నాకు ఏమి జరగా లేదనే భావన లో ఉండండి. బి పోజిటివ్ గా ఉండదానికి ప్రయాత్నించాలి అనుకోకుండా హార్ట్ అట్టాక్ వచ్చిన వాళ్ళలో ౩౦ నుండి 4౦% మంది చనిపోడానికి అవకాసం ఉంది.అనుకోకుండా హార్ట్ అట్టాక్ తో పోయే వాళ్ళలో 75% మంది మొదటి రెండు గంటల్లో చనిపోతున్నారు వాళ్ళలో సగం మంది వైద్య సహాయం లభించే లోపు 5 నుండి 1౦ నిమిషాలలోనే చనిపోవడం మనం గమనించ వచ్చు.అందుకే హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు తక్షణం స్పందించడం తప్పనిసరి.

తక్షణం తీసుకోవాల్సిన చర్యలు...

ఎత్తిపరిస్తుతుల లోనూ భయపడ కూడదు.రోగి చుట్టూ ఉన్నవాళ్ళు హడావిడి చేయకుండా భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 5 నుండి1౦ నిమిషాలే కీలకం అది గడిచిందా చనిపోయే అవకాశాలు 5౦% తగ్గినట్టే ఆసుపత్రిలో ఉన్నా కాని వెంటనే తక్కువ వ్యవధిలో వైద్య సహాయాన్ని పొందలేరన్నది అందరికీ తెలిసిందే.మీకు  కడుపులో అల్సర్లు లేకపోతే సగం అస్ప్రిన్ టాబ్లెట్ నోట్లో వేసుకోవచ్చు. వంటి మీద దుస్తుల్ని వదిలి వేయండి.మీకు ఎగదిలో అయితే గాలి వీస్తుందో ఆ మంచం మీద మీకు అనువైన విధంగా పడుకోండి. శ్వాస ఇబ్బందిగా ఉంటె ఒకటి రెండు దిళ్ళ ను తలకింద ఉంచుకోండి.డైజిన్ లాంటి యాంటీ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటె 2-లేదా ౩ టాబ్లెట్స్ వేసుకోండి.గ్లూకోజ్ నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు తాగండి.మధ్యం లేగా సిగరెట్ల జోలికి పోకండి.

 

హార్ట్ అట్టాక్ నుండి కోలుకున్నాక...

హార్ట్ అట్టాక్ నుంచి కోలుకున్నాక ఎవరైనా చాన్నాళ్ళ దాకా మనస్సులోపల  భయం వర్రీ, డిప్రెషన్, లాంటి వాటికి లోనవుతారు. హార్ట్ అటాక్ కి ముందు ఛాతీలో చిన్న చిన్న నొప్పి వచ్చినా కూడా పట్టించుకోక పోయి ఉండవచ్చు. గాని ఇప్పుడు మాత్రం ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా గుండెల్లో రైళ్ళు పరు గెట్టు తుంటాయి. ఇది సహజం కొన్నాళ్ళకి మామూలుగా అయిపోతారు.హార్ట్ అట్టాక్ నుంచి కోలుకున్న పేషంట్లలో 8౦ -9౦% మంది 8 -1౦ వారాల లోపల తిరిగి తమ మా,మూలు పనులు చేసుకోవచ్చు.గుండెకు ఎంత మేర డ్యామేజ్ జరిగిందన్న దానిని బట్టి అతను ఎంత శ్రమకు తట్టుకో గలుగు తాడనేది ఆధార పది ఉంటుంది దీనికి సంబంధించి డాక్టర్స్ తగిన సలహాలు సూచనలు అందిస్తారు.<

హార్ట్ పేషంట్ వచ్చిన వారు వ్యాయామం క్రీడలు ఆడవచ్చా...

బరువు లేత్తకూడదు.హడా విడిగా భోజనం చేయకూడదు.రాత్రి మీరు తీసుకునే భోజనం పాడుకోడానికి రెండు గంటలు ముందుగా తీసుకోవాలి. అది కూడా తేలిక పాటి ఆహారాన్ని తీసుకోవాలి.డాక్టర్స్ సూచించిన విధంగా రెగ్యులర్ గా మందులు వాడాలి. డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్గా మందుల్ని వాడాలి.ఇండ ర్నల్, సిప్లర్, టెనో మీనన్ ,బేటా -బ్లాకింగ్ మందుల్ని వాడుతున్నప్పుడు.ఎప్పుడూ వెంట తెచ్చు కోవాలి. ఈ మందులు తయారు చేసిన 6 నెలల లోపల ఉండాలి.ముఖ్యంగా ఎక్సపైరీ డేట్ కు ముందు వాడాలి.హార్ట్ చాలా చిన్నది ఆ చిన్న గుండెకే నొప్పి వస్తే భద్రం మరి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu