సినిమాల్లో హీరో.. రియల్ లైఫ్ విలన్

 

ఓ హీరో సినిమాలో  బాగా నటించాడు.. కానీ నిజజీవితంలో మాత్రం జీవించాడు. అతని పర్ఫామెన్స్ తట్టుకోలేక అతని భార్య పోలీసులను ఆశ్రయించింది...ఆ హీరో మరి ఎవరో కాదండోయ్...ధర్మా మహేషే... అవును ఇతనిపై కేసు నమోదు అయింది. ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్... సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటిం చాడు. సినిమాలో ఎదుగుతున్న సమయంలోనే ఇతనికి పెళ్లి జరిగింది. 

అయితే ఈ హీరో సినిమాల్లో హీరో గా నటిస్తు..అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం విలన్ పాత్ర పోషించి... భార్య కు నరకం చూపిస్తు న్నారు.. హీరో మహేష్ మూవీ అవకాశాలు రాక పోవడంతో జల్సాలు, షికార్లకు అలవాటు పడి... ప్రతినిత్యం అదనపు కట్నం కోసం  తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ హీరో ధర్మ మహేష్ భార్య గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బాధితురాలు ఇచ్చిన తరువాత మేరకు హీరో పై గచ్చిబౌలి మహిళ పోలీస్ స్టేషన్‌లో  పలు సెక్షన్ల పై కేసు నమోదు చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu