తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది.  గురువారం ( జులై 17) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  కంపార్ట్ మెంట్లన్నీ నిండపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై 16) శ్రీవారిని 75 వేల 104 మంది దర్శించుకున్నారు. వారిలో   31,896 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.   శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది.