తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on May 27, 2025 9:20AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులే ముగియనుండటంతో తిరుమల వేంకటే శ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థల సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
దీంతో వారంతాం, వారం ప్రారంభం అన్న తేడా లేకుండా తిరుమల భక్త జన సంద్రంగా మారింది. మంగళవారం (మే 27) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి18 గంటలకు పైగా సమయం పడుతున్నది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 83,542 మంది భక్తులు దర్శించుకున్నారు. వరిలో 34,265 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 9లక్షల రూపాయలు వచ్చింది.