తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈ ఉదయం భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతి స్తున్నారు.

మంగళవారం శ్రీవారిని 62వేల 269 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 19వేల 255 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 19లక్షల రూపాయలు వచ్చింది. ఇక ఈ రోజు టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలలోపు సమయం పడుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu