దేవయానితో అనుచితంగా వ్యవహరించలేదు: అమెరికా

 

భారత దౌత్యాదికారిణి దేవయాని కోబ్రగాడే పట్ల న్యూయార్క్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే గాక నేటికీ ఆమెను ఇతర నేరస్తులతో కలిపి జైలులో బందించి ఉంచారు. అందుకు భారత్ తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం చేసి, ఆమెను తక్షణమే విడుదల చేసి భారత్ కు త్రిప్పిపంపాలని, జరిగినదానికి అమెరికా ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరింది. భారత్ తన నిరసన తెలియజేసేందుకు అనేక చర్యలు చెప్పటింది.

 

అయితే న్యూయార్క్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మీడియాతో మాట్లాడుతూ జరిగినదానిపై ఎటువంటి పశ్చాత్తాపము కనబరచకపోగా, తమ దేశ చట్టాలకి లోబడే దేవయానిపై చర్యలు తీసుకొన్నామని, తమ పోలీసు అధికారులు కూడా నిబంధనల ప్రకారమే ఖైదీలందరినీ ఏవిధంగా విచారిస్తారో అదేవిధంగా ఆమెను కూడా విచారించారని తెలిపారు. అందువల్ల ఇటువంటి అంశం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతంగా కలిగే విధంగా వ్యవహరించకూడదని ఆమె భారత్ కు సుద్దులు చెప్పడం విశేషం. ఏమయినప్పటికీ, దేవయాని పట్ల తమ పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారో లేదో తెలుసుకొంటామని, అలాగే తమ చట్టపరిధిలో ఆమె విడుదలకు గల అవకాశాలను తప్పక పరిశీలిస్తామని హామీ కూడా ఇచ్చారు.

 

ఒక మహిళా అధికారి అయిన మేరీ హర్ఫ్ సాటి మహిళ పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని ఖండించకపోగా ఈవిధంగా మాట్లాడటం సిగ్గు చేటు.