500 కోట్లు కొల్లగొట్టింది

 

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటి దీపిక పదుకునే సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది అంతా  ఒక్క హిట్‌ కూడా లేక ఉసూరు మన్న ఈ లాంగ్‌ లెగ్స్‌ బ్యూటి ఈ ఏడాది మాత్రం ఏ రేంజ్‌ హవా చూపించింది ఏకంగా తన సినిమాలతో 500 కోట్ల వసూళ్లను కలెక్ట్‌ చేయనుంది.
 ఇప్పటికే ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి.

అంతే కాదు ఈ ఏడాది ఈ అమ్మడు నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ 200 కోట్లకు పైగా లైక్ట్‌ చేయగా, యే జవానీ హై దివానీ సినిమా 190 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు రేస్‌ 2 కూడా 100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకోవడంతో
ఇప్పటికే ఒకే ఏడాది 500 కోట్లు కలెక్ట్‌ చేసిన హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది దీపిక.

దీనికి తోడు ఈ అమ్మడు నటించిన రామ్‌లీలా కూడా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుండటంతో తన రేంజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఇన్నాళ్లు కత్రినా, కరీనాలు మాత్రమే స్టార్‌లు అనుకునే బాలీవుడ్‌ జనాలతో తన జపం చేయిస్తుంది దీపిక.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu