బందిపోటును సిద్దం చేస్తున్నాడు

 

చిన్న సినిమా అంటే బూతు సినిమా అనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్న ఈ రోజుల్లో చిన్న సినిమాను కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్న అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకరు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇటీవలే అంతుకు ముందు ఆతరువాత సినిమాతో కూల్‌ హిట్‌ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.

గ్రహణం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహనకృష్ణ తరువాత అష్టాచెమ్మా సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ను కూడా అందుకున్నాడు. తరువాత చేసిన గోల్కొండా హైస్కూల్‌ సినిమా మరో మంచి హిట్‌ అందుకున్న మోహన్‌కృష్ణ కాస్త గ్యాప్ తీసుకొని అంతకు ముందు ఆతరువాత సినిమాతో యువత మనోభావాలను వెండితెర మీద ఆవిష్కరించాడు.ఇప్పుడు మరోసారి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇన్నాళ్లు ఫామ్‌లో ఉన్న స్టార్‌ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయని ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఇప్పుడు అల్లరి నరేష్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు.

ప్రస్థుతం రవిబాబుతో సినిమా డైరెక్షన్‌లో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న నరేష్‌ ఆ సినిమా తరువాత మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో రూపొందే సినిమాలో నటించనున్నాడు. బందిపోటు పేరుతో తెరకెక్కనున్న ఈసినిమా నరేష్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ సెన్సిబుల్‌ టచ్‌ కూడా ఉంటుందంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu