టీఆర్ఎస్ లో చేరనున్న దానం..?

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. ఇప్పటి వరకూ దానం నాగేందర్ టీఆర్ఎస్ లోకి చేరుతారా? లేదా? అన్న సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం ఆయన  టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈరోజు తన నివాసం వద్ద ముఖ్య అనుచరులతో భేటీ అయిన ఆయన ఈ  నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో దానం కాంగ్రెస్ పార్టీ మార్పుపై టీ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగానే షబ్బీర్ అలీ దానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu