క్రికెటర్ చాహల్ దంపతుల విడాకుల పుకార్లు షికార్లు 

ప్రముఖ క్రికెటర్ యజువేంద్ర చాహల్ ,కొరియోగ్రాఫర్  ధనశ్రీ వర్మ  మధ్య విడాకుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య ధనశ్రీతో దిగిన ఫోటోలను యజువేంద్ర డిలీట్ చేశాడు.ఇన్ స్టా గ్రాలో ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ నుంచి డెంటిస్ట్ గా మారిన ధనశ్రీ స్వంతంగా యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఈ చానల్ కు మంచి గుర్తింపు ఉంది. ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు.  ఈ చానల్ కు 2.79 మిలియన్ సబ్ స్క్రైబ్ లు ఉన్నారు. ఇద్దరూ ఆర్థికంగా బాగా ఎదిగారు. ఒకవేళ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేస్తే చాహల్ ధనశ్రీకి ఎంత చెల్లించాలి అనేది తేలాల్సి ఉంది. కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది.  ధనశ్రీ వర్మ నెట్ ప్రాఫిట్  రూ.25 కోట్లు. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆదాయం బాగా గడించింది. ధనశ్రీ వర్మకు బాలివుడ్, టాలివుడ్ రంగాల్లో హీరోయిన్ గా అవకాశాలు వరిస్తున్నాయి. వీరిద్దరి విడాకుల పుకార్లను ఇంతవరకు చాహల్ గానీ ధనశ్రీ గాని ఖండించకపోవడం గమనార్హం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu