వెంకయ్యనాయుడిది జ్యోతిలక్ష్మీ నాలుక.. మోడీకి కట్టుకున్న పెళ్లాం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెరైటీగా తిట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు కూడా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడులను చాలా విచిత్రమైన పోలికలతో విమర్సించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే.. కాదు కాదు మేము అధికారంలోకి కనుక వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు బీజేపీ పార్టీ, వెంకయ్య నాయుడు కూడా చెప్పారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే మాత్రం నీళ్లు నములుతున్నారని అన్నారు. అంతేకాదు వెంకయ్య నాలుకను జ్యోతిలక్ష్మి నడుముతో పోల్చుతూ.. వెంకయ్యనాయుడు నాలుక జ్యోతిలక్ష్మీ నడుములా ఎటుబడితే అటు తిరుగుతుందని ఎద్దేవ చేశారు. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా మండిపడ్డారు. మోడీకి ఏపీ కట్టుకున్న పెళ్లామని.. కట్టుకున్న పెళ్లాం లాంటి  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ‘నీతో ఉండను' పొమ్మంటున్నారని అన్నారు. మొత్తానికి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నారాయణకు ఈసారి మోడీ, వెంకయ్య బలైయ్యారన్నమాట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu