అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్టు
posted on Jan 30, 2025 3:08PM

రాజస్థాన్ లో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యాచారం కేసులో సీతాపూర్ ఎంపీ రాకేష్ రాథోడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై ఈ అరెస్టు జరిగింది.
వివాహం చేసుకుంటానని చెబుతా ఎంపీ రాకేష్ రాథోడ్ గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ఓ మహిళ ఈ నెల 15న ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో పాటు రాకేష్ రాథోడ్ తనతో జరిపిన ఫోన్ కాల్స్ జాబితా, వాయిస్ రికార్డ్ లను కూడా అందజేయడంతో పోలీసులు ఆయనపై ఈనెల 17న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా
ఎంపీ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ డిస్మిస్ చేసింది. దీంతో పోలీసులు ఎంపీ రాకేష్ రాథోడ్‌ను గురువారం (జనవరి 30) అరెస్ట్ చేశారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కార్యకర్తలు అడ్డుకు న్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, భారీ భద్రత మధ్య రాకేష్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.