వీళ్లకు విషయం నిల్లా..?

 congress balaram nayak, basavaraja saraiah, congress young leaders, congress youth leaders

 

యువజన కాంగ్రెస్ కేంద్ర విభాగం రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలను పనితీరు సరిగా లేని కారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే వీరు సాదాసీదా నాయకులు కాకపోవడం విశేషం.

 

మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి శంకర్, వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీమాన్ లను పార్టీ సస్పెండ్ చేసింది.


వీరిలో, సాయి శంకర్ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కుమారుడు కాగా, శ్రీ మాన్ రాష్ట్ర బి సి సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు. ఈ ఇద్దరు నాయకులు గత జూలై నెలలోనే ఈ పదవులకు ఎన్నికయ్యారు.


ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ లిజు ఈ ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక కార్యక్రమాలను సరిగా నిర్వహించక పోవడం వల్లే వీరిఫై ఈ చర్య తీసుకున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu