కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
posted on Aug 27, 2025 5:57PM
.webp)
2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బీడ్ వేసేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గోనన్నాయి. భారత్ బీడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
2026 గ్లాస్గో క్రీడల మాదిరిగా కాకుండా, 2030లో పూర్తిస్థాయిలో అన్ని క్రీడాంశాలతో గేమ్స్ నిర్వహిస్తామని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు రోహిత్ రాజ్‌పాల్ అన్నారు. "భారత్‌కు ఎక్కువ పతకాలు తెచ్చిపెట్టే షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ వంటి క్రీడలతో పాటు మన దేశీయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోలను కూడా చేర్చాలనియోచిస్తున్నాం" అని ఆయన వివరించారు. కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో సమావేశమై ఆతిథ్య దేశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్ గతంలో 2010లో ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.