కొల్లాజెన్ బూస్ట్ ఫుడ్స్.. ఇవి తింటే  వృద్దాప్యం అస్సలు రాదు..!



మహిళలకు 30 ఏళ్ల వయస్సు దాటగానే  కొత్త ప్రయాణం మొదలైనట్టే ఉంటుంది. కెరీర్, కుటుంబం,  వ్యక్తిగత జీవితంలో కొత్త విషయాలు వచ్చి చేరే సమయం ఇదే.  30 ఏళ్ళ తరువాత మహిళల జీవనశైలి మారడమే కాకుండా, శరీరం లోపల కూడా చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా దీని ప్రభావం చర్మ ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత, శరీరంలో కొల్లాజెన్ స్థాయి క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, కీళ్లు లూజ్ కావడం,  దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.  అయితే దీని వల్ల   ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో కొన్ని పదార్థాలు  చేర్చుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.   చర్మం,  కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలు..

నారింజ, నిమ్మ, ఆమ్లా, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి,  క్యాప్సికమ్ వంటివి  ఆహారంలో భాగంగా చేసుకోవాలి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు చర్మ కాంతిని కాపాడుతుంది.

 ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం..

గుడ్డు, చేపలు, చికెన్, కాటేజ్ చీజ్, పెరుగు,  పప్పులు ప్రోటీన్ కు అద్భుతమైన వనరులు. అవి కొల్లాజెన్ ఏర్పడటానికి,  శరీర బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి.

గింజలు, విత్తానాలు..

బాదం, వాల్‌నట్స్, చియా గింజలు,  అవిసె గింజలు వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి . వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు..

పాలకూర, మెంతులు, బ్రోకలీ,  క్యాబేజీ వంటి కూరగాయలు  శరీరంలో క్లోరోఫిల్ మొత్తాన్ని పెంచడం ద్వారా కొల్లాజెన్ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.


                               *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu