ఇక 21 ఏళ్లకే అసెంబ్లీలోకి?

 

రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త కామెంట్ చేశారు. అదేంటంటే గతంలో రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చేలా చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 21 ఏళ్లకే అసెంబ్లీలో అడుగు పెట్టేలా తాము చట్ట సవరణ చేయాలని భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి 18 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలను ఎంపిక చేసుకుంటున్నపుడు.. 21 ఏళ్లకు మాత్రం ఎందుకు ఎమ్మెల్యే కాకూడదని అన్నారు రేవంత్. ఇప్పటికి ఈ వయసు 25 ఏళ్లుగా ఉందని.. మీరంతా సమ్మతిస్తే తామీ నిర్ణయం తీసుకోవడం ఏమంత కష్టం కాదని అన్నారాయన.

అయితే అలా జరగాలంటే, రాహుల్ గాంధీ పీఎం కావల్సి ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే మిగిలిన వన్నీ అలవోకగా జరిగిపోతాయని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రేరణతో చట్ట సభల్లో యువరక్తం అడుగు పెట్టేలా తామంతా సిద్ధంగా ఉన్నామని.. కాంగ్రెస్ కి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయగలిగితే ఇదంతా సాధ్యమేన్నారు రేవంత్.

ఓకే గానీ ఇదంతా చూస్తుంటే పెళ్లి వయసును తలపిస్తోందని అంటున్నారు. పెళ్లిలో 18 ఏళ్ల అమ్మాయి- 21 ఏళ్ల అబ్బాయిని అధికారికంగా అర్హమైన వయసుగా చెబుతుంటారు. ఇప్పుడు పద్దెనిమిదేళ్లకు ఓటు హక్కు, 21 ఏళ్లకు అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత రావడం ఒక రకంగా కొత్త రాజకీయం చూసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఇక బీజేపీకి మల్లే కాంగ్రెస్ లో కూడా 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి విరమణ తీసుకునే విధానం కూడా తెస్తే బావుంటుందని.. అప్పుడు ఆటోమేటిగ్గా.. రాజకీయాల్లో యువ రక్తం ప్రవేశిస్తుందని కామెంట్ చేస్తున్నారు కొందరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu