గోల్కొండ కోటలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
posted on Aug 15, 2025 11:00AM
.webp)
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు అయన పోలీసు బలగాలు కవాతు నిర్వహించగా ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి పతకాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతు అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని అన్నారు.‘గతేడాది ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. విత్తనాలు వేసేనాటికి రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేశామని పేర్కొన్నారు. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేశామని వెల్లడించారు. వారు పండించిన చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తున్నాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించాం’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు