కత్తి, స్వామిల నగర బహిష్కరణ సరైన నిర్ణయమే.!!

 

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను, శాంతి భద్రతల దృష్ట్యా కత్తి మహేష్ ను హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.. అలానే పరిపూర్ణానంద స్వామి కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ ఆయన్ని కూడా నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ నగర బహిష్కరణల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కొందరు ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటుండగా.. మరి కొందరు ఇదే కరెక్ట్ అంటున్నారు.. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటుంది.. రీసెంట్ గా కొందరు బీజేపీ నేతలు ప్రభుత్వ నిర్ణయం పట్ల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసారు.. అయితే గవర్నర్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారెవరినీ ఉపేక్షించకూడదన్నదే తమ సంకల్పమని, అందుకే వారిద్దరిపై నగర బహిష్కరణ వేటు వేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu