బీజేపీతో జగన్ దోస్తీ కట్టనున్నారా?

 

గత ఎన్నికల్లో భాజపాతో జట్టు కట్టిన టీడీపీ విభజన హామీలు నెరవేర్చక పోవటంతో పొత్తు విరమించుకొని  కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూవస్తుంది. బీజేపీ నుంచి తెదేపా దూరం అవటంతో ఏపీలో తమ పార్టీ మనుగడ కష్టమవుతుందని భావించి ప్రతిపక్ష పార్టీ వైసీపీ తో  జట్టు కట్టే దిశగా అడుగేస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కేంద్ర సామజిక న్యాయ, సాధికారత శాఖ  సహాయ మంత్రి రాందాస్ ఓ ప్రకటనలో జగన్ ఎన్డీయేలోకి రావాలని ఆహ్వానించారు. జగన్  పార్టీ లో చేరితే ఏపీ ముఖ్యమంత్రి అవటానికి తమ సహకారం ఉంటుందని తెలిపారు. టీడీపీ అంటేనే కాలు దువ్వే జగన్ బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా? లేదా? అని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu