కేసీఆర్‌ 'హార్ట్' వార్నింగ్‌!.. సీరియస్ ప్రాబ్లమేనా?

స‌డెన్‌గా సీఎం కేసీఆర్ య‌శోద హాస్పిట‌ల్‌కి వెళ్లారు. ఒంట్లో ఏదో తేడాగా అనిపించ‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. య‌శోద‌లో వివిధ ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేశారు. 

కేసీఆర్‌కు గుండె, యాంజియో, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారని సీఎం కార్యాలయం వెల్లడించింది. కేసీఆర్ రెండు రోజులుగా నీరసంగా ఉన్నారని.. ఎడమ చేయి లాగుతున్నట్టు చెప్పారని వైద్యులు అంటున్నారు. అంటే.. కేసీఆర్‌కు గుండె నొప్పి ఏమైనా వ‌చ్చిందా? అనే అనుమానం క‌లుగుతోంది. అయితే, ఆయ‌న ఆసుప‌త్రికి న‌డిచుకుంటూ వెళ్లారు. అంటే, పెద్ద‌గా ప్ర‌మాద‌మేమీ లేద‌ని తెలుస్తోంది. కానీ, ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే కేసీఆర్.. హాస్పిటల్ లోకి వెళుతున్న విజువల్స్ లో బాగా డల్ గా కనిపించారు. చాలా నిదానంగా నడుస్తున్నారు. ఇక, కేసీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి శోభ, కూతురు క‌విత‌, ఎంపీ సంతోశ్ కుమార్ కూడా ఉండ‌టంతో.. ఏదైనా పెద్ద ప్రాబ్లమేనా? అనే భావ‌న క‌లుగుతోందని అంటున్నారు.  

అస‌లే, కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రం..అంటారు. ఆయ‌న‌కు అనారోగ్యం అంటే చాలా భ‌యం. ప్ర‌తీరోజూ మందుగోలీలు మింగాల్సిందే. ఆయ‌న‌కు టాబ్లెట్స్ ఇచ్చేందుకే ప్ర‌త్యేకంగా ఓ మ‌నిషి కూడా ఉంటార‌ని అంటారు. కేసీఆర్‌కు హాస్పిట‌ల్స్ అన్నా.. ట్రీట్‌మెంట్స్ అన్నా ఆందోళ‌న ఎక్కువ‌. అత్యంత అవ‌స‌రం అయితే త‌ప్ప‌.. ఆయ‌న ఆసుప‌త్రి గ‌డ‌ప తొక్క‌రు. అలాంటిది, ఇంట్లో క్యూర్ కాలేని ప‌రిస్థితి ఉంటేనే.. ఏవైనా ప్ర‌త్యేక‌ టెస్టుల అవ‌స‌రం అయితేనే.. హాస్పిట‌ల్‌కు వెళ‌తారు. యాంజియోగ్రామ్, సీటీ స్కాన్ చేశారంటే.. కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అందులోనూ, ఇవాళ కేసీఆర్ యాదాద్రి వెళ్లాల్సి ఉంది. ఆ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారంటే.. పెద్ద ప్రాబ్ల‌మే అయి ఉంటుంద‌ని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu