పాలేరు ప్రజలకు ధన్యవాదాలు.. చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్

 

పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలో గెలిపించినందుకు పాలేరు ప్రజలకు, నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పాలేరు చరిత్రలో 45 వేలు మెజార్టీ రావడం ఇదే తొలిసారి.. ఈ ఫలితాలు మాకు మరింత బాధ్యతను పెంచాయి అని అన్నారు.. టీఆర్ఎస్ పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది.. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు తిప్పికొడుతున్నారు.. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu