వెంకయ్యకు కేసీఆర్ లేఖ.. సాయం చేయండి..

హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రమంత్రి వెంకయ్యకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. కేవలం రూ.100 కోట్లతో హైదరాబాద్ లో అభివృద్ధి అసాధ్యమని.. ఇప్పుడు హైదరాబాద్ ను మళ్లీ స్మార్ట్ సిటీ పథకంలో చేర్చారు.. ఈ నేపథ్యంలో కేవలం 100 కోట్లతో ఏం చేయలేం అని స్పష్టం చేశారు. రూ.5,500 కోట్లు వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్‌ఎంసీ..  625 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి హైదరాబాద్ ఏ-1 కేటగిరి నగరంగా ఉన్న హైదరాబాద్ కు రూ.100 కోట్లు మాత్రమే ఇస్తే ఎటువంటి పనులు చేపట్టలేమన్నారు. హైదరాబాద్ స్థానంలో స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేయాలని.. దీంతో కరీంనగర్‌లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి సాధ్యమవుతోందని అందులో పేర్కొన్నారు.