అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ.. నిధులివ్వండి ప్లీజ్
posted on Oct 27, 2015 3:03PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్దికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశయ్యారు. ఈ భేటీలో ఇద్దరు పలు అంశాల మీద చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్దికి కేంద్రం సాయం చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అభివృద్ధి పథకాలకి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంపుతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాగా అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి రామచంద్రు తేజావత్ లు ఉన్నారు.