సీఎంవా? మత ప్రచారకుడివా?            

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ వైఫల్యం వల్లే జనాలు చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నా జగన్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  వేల్పూరి శ్రీనివాస రావు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన  బహిరంగ లేఖ   రాశారు.

రాష్ట్రంలో కోనిడ్ విలయ తాండవం చేస్తుంటే  అత్యవసర కేబినెట్ సమావేశం పెట్టి పాస్టర్లకు వేతనాలు పెంచడం ఏంటని లేఖలో వేల్పూరి శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పాస్టర్ లకు 5 వేలు నుండి 10 వేలు , ఇమామ్ లకు 5 వేలు నుండి 10 వేలు , పురోహితులకు 10 వేలు నుండి 15 వేలుకు నెలకు వేతనం పెంచాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు.  ముఖ్యమంత్రి ముసుగులో వున్న మత ప్రచారకుడు జగన్ అని రుజువు అయిందని తన బహిరంగ లేఖ లో వేల్పూరి స్పష్టం చేశారు. తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11మంది కోవిడ్ బాధితులు చనిపోతే కేవలం 10 లక్షలు పరిహారం ఇవ్వటం,  అదే విశాఖపట్నం గ్యాస్ లీకై మృతి చెందిన వారికి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వటం మృతుల పట్ల వివక్ష చూపడమేనని   వేల్పూరి శ్రీనివాస రావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. కొవిడ్ బాధితులకు సత్వరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.