పట్టిసీమతో పరపతి పెరిగింది
posted on Sep 25, 2015 1:03PM

సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టిసీమ ప్రాజెక్టుకు.. అది అనుకున్నప్పటినుండి అడ్డంకులు మొదలవుతూనే ఉన్నాయి. ప్రతిపక్షనేతలు ఎన్నివిమర్శలు చేసినా అవేమి పట్టించుకోకుండా పట్టుదలతో పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం చేసి అరుదైన ఘనత దక్కించుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు కేంద్రమంత్రి ఉమాభారతి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్బంగా ఉమాభారతి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానంలో సాధించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఆమె ప్రశంసించారు. మేము ఇంకా నదుల అనుసంథానం విషయంలో పథకాల రూపకల్పనలోనే ఉంటే చంద్రబాబు మాత్రం ఆపని చేసి చూపించారని.. సరికొత్త రికార్టు సృష్టించారని కొనియాడారు. నదుల అనుసంధానంపై చంద్రబాబు కృషి దేశానికి ఆదర్శం అన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టును కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని.. పోలవరంకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు పట్టుదలతో నిర్మాణం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మంచి గుర్తింపే లభించినట్టు తెలుస్తోంది.