ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలి.. చంద్రబాబు
posted on Nov 21, 2015 3:49PM

నెల్లూరు వరదలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితుల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు సాయంత్రం లోపు బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, పామాయిల్ నూనె పంపిణీ చేయాలని చెప్పారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం, పంటలకు రెండురోజుల్లో నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.
కాగా నెల్లూరు జిల్లాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏరియల్ సర్వే చేశారు. నెల్లూరు వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మనుబోలు వద్ద గండిపడిన హైవేను ఆయన పరిశీలించి..యుద్ద ప్రాతిపదికన హైవే ను పునరుద్దరించాలని మోడీ ఆదేశించారని తెలిపారు. కాగా వరద నష్టంపై నివేదిక ఇచ్చిన తరువాత కేంద్రం సాయం చేస్తుందని స్పష్టం చేశారు.