చంద్రబాబు.. కేసీఆర్.. ఇంతలోనే ఎంత మార్పు

 

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని మన తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తేనే పరిస్థితి అర్ధమవుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత కేసీఆర్ కు తెలంగాణ మిగులు బడ్టేట్ లో గుజరాత్ తరువాత రెండో స్ఠానంలో ఉన్న రాగా.. చంద్రబాబుకేమో ఏపీ ఆర్ఠిక లోటు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు తెలంగాణలో  కేసీఆర్ తన దూకుడుని ప్రదర్శిస్తూ ఎలాగూ మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి హామీల మీద హామీలు.. వేతానాల్లో ఏపీ పెంచిన దాని కంటే ఒక శాతం ఎక్కువే పెంటడం లాంటి పనులు చేసి తన ఒంటెద్దు పోకడని అనుసరించారు. మరోవైపు చంద్రబాబు.. ఒక రకంగా చెప్పాలంటే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టతరమైన పనే. అలాంటి పనికి తాను పూనుకొని రాజధాని నిర్మాణానికి.. ఏపీ అభివృద్దికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో వారుంటే అప్పుడే ఓటుకు నోటు కేసు బయటకొచ్చింది. ఇంకేముంది.. దీంతో చంద్రబాబు పని అయిపోయింది.. చంద్రబాబు ఈ కేసులోంచి బయటకు రావడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ మాటలు కొన్ని రోజుల వరకే పరిమితమయ్యాయి. పరిస్థితి తారుమారైపోయింది.

ఇప్పుడు చంద్రబాబు ఏపీ అభివృద్ధికోసం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటే.. కేసీఆర్ పరిస్థితే అయోమయంలో ఉంది. ప్రపంచ బ్యాంకు ఏపీకి రెండో స్ఠానం ఇవ్వడం.. విద్యుత్ పంపిణీ సరఫరాల నష్టాల తగ్గింపులో ఏపీ ముందుండటం.. వెరసి చంద్రబాబు రాష్ట్రంకోసం పని చేస్తున్న దిశకు నిదర్శనం. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే మిగులు బడ్జెట్ అయిపోయి అప్పుల పాలైంది.. మరోవైపు రైతుల ఆత్మహత్యలు.. అదీకాక ఏదో విషయంలో హైకోర్టు చేతనో.. సుప్రీంకోర్టు చేతనో మొట్టికాయలు వేయించుకోవడమో.. అందులోనూ ప్రపంచ బ్యాంకు 13వ ర్యాంకు ఇవ్వడంతో కేసీఆర్ కు ఎం చేయాలో తెలియని పరిస్థితో ఉన్నారు. అంతేకాక ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలోనూ టీఆర్ఎస్ నేతలకు కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్నట్లు ఇద్దరు సీఎంల విషయంలో ఇంతలోనే ఎంత జరిగింది అన్నట్టు ఉంది వ్యవహారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu